Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చిన భార్య... తర్వాత ఏమైంది?

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (09:50 IST)
ముంబైలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య తన భర్తను హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి అడ్డు లేకుండా చేసుకుంది. చివరకు మృతుడి బంధువులు అనుమానించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో  ఆమె, ఆమె ప్రియుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
 
ముంబై శాంతాక్రజ్ ప్రాంతానికి చెందిన కవతి - కమల్ కాంత్ అనే దంపతులు ఉన్నారు. భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా కొంతకాలంగా ఉంటూ వచ్చింది. అయితే పిల్లల భవిష్యత్ దృష్ట్యా భర్త వద్దకు మళ్లీ వచ్చింది. ఇదిలావుంటే, కమల్ కాంత్ - హితేశ్ జైన్‌లు బాల్య స్నేహితులు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేసేవారు. 
 
ఈ క్రమంలో కవితకు హితేశ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఇంతలో అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, కమల్ కాంత్‌కు జరిగిన వివిధ వైద్య పరీక్షల్లో రక్తంలో ఆర్సెనిక్, థాలియంలు సాధారణ స్థాయి కంటే అధిక మోతాదులో ఉన్నట్టు తేల్చారు. పైగా, మానవ శరీరంలో ఇలాంటి లోహాలు చేరడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీన కమల్ కాంత్ చనిపోయారు. దీంతో పోలీసులు తొలుత ఆకస్మిక మరణంగా నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
అయితే, కమల్ కాంత్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ మృతిలో ఏదో కుట్ర కోణం దాగివుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకునేందుకు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసినట్టు కవిత పోలీసలకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడు హితేశ్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments