Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ జరగలేదు.. జననాంగం వద్ద చీమకుట్టింది... బాధిత బాలిక తల్లి కోర్టులో సాక్ష్యం

ఓ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 20 యేళ్ల యువకుడికి ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు కావడానికి బాధిత బాలిక తల్లి తన సాక్ష్యాన్ని ఓ అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించడమే.

Webdunia
మంగళవారం, 9 మే 2017 (09:31 IST)
తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, జననాంగం వద్ద చీమ కుట్టిందని అందులో పేర్కొంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముంబైలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అత్యాచారానికి గురైన బాధిత బాలిక తల్లి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తో అత్యాచారం కేసులో నిందితుడైన 20 ఏళ్ల యువకుడికి కోర్టు బెయిలు మంజూరు చేసిన వింత ఉదంతం ముంబై నగరంలో వెలుగుచూసింది. 
 
ముంబైకు చెందిన 20 ఏళ్ల యువకుడు నాలుగేళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని పోలీసులు కేసు పెట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు బాధిత తల్లి నుంచి కోర్టు అఫిడవిట్ కోరింది. దీంతో ఆమె తన సాక్ష్యాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాడు. 
 
'మా అమ్మాయిపై అత్యాచారం జరగలేదు... జననాంగం వద్ద చీమ కుట్టిందని, దాంతో అక్కడ ఎర్రగా కందడంతో పాప రాత్రంతా గోకడం వల్లనే గాయమైంది... దీంతో చికిత్స కోసం మా అమ్మాయిని సీయోన్ ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యుల ఫిర్యాదు మేర పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు' అని బాధిత బాలిక తల్లి ముంబై కోర్టుకు తెలిపింది. 
 
నిందితుడు తమకు కుటుంబ స్నేహితుడని, ఆయనే తమ కూతురిని బాగా చూసుకుంటున్నాడని సాక్షాత్తూ బాధిత బాలిక తల్లి పేర్కొనడం సంచలనం రేపింది. తమ కూతురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తే చాలని బాధిత బాలిక తల్లి పేర్కొనడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధిత బాలిక తల్లిపై, సాక్షులపై ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిడి తీసుకురావద్దని కోర్టు కోరడం ఈ కేసులో కొసమెరుపు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం