Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుల వికృతానందం.. మద్యం సేవించి కుక్కపై గ్యాంగ్ రేప్...

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (16:10 IST)
ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన కుక్క చనిపోయింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులు పెట్టిన చిత్ర హింసలు, నొప్పి భరించలేకే ఆ శునకం చనిపోయిందని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలోని మలాడ్ పశ్చిమలో వున్న మల్వానీ ప్రాంతంలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈనెల 20వ తేదీన మల్వానీ ప్రాంతానికి చెందిన నలుగురు కామాంధులు మద్యం మత్తులో కళ్లు మూసుకుని పోయి అత్యంత హేయంగా కుక్కపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ శునకాన్ని లైంగికంగా తీవ్రంగా వేధించి వికృతానందం పొందారు. 
 
రోజూ ఇంటికి వచ్చే కుక్క ఆ రోజు ఆహారానికి ఇంటికి రాకపోవడంతో ఓ యువతి వీధిలో వెతుక్కుంటూ వెళ్లింది. అపుడు ఓ చర్చికి సమీపంలో కుక్క మూలుగుతుండం చెవికి వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకోగా.. రక్తపు మడుగులో ఉన్న మూగజీవాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది. 
 
తక్షణం తన స్నేహితుల సహకారంతో ఆ కుక్కను సమీపంలో ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. మర్మాయవాల వద్ద తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్ని చూసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అమానవీయ విషయం వెలుగులోకి వచ్చింది. శునకంపై మద్యం మత్తులో ఉన్న నలుగురు దుండగులు అత్యాచారం చేశారని తేలింది. శునకం నోరు కట్టేసి.. లైంగికంగా చిత్రహింసలకు గురిచేశారని వెల్లడైంది. ఈ దారుణ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం