కాపురానికి రాలేదని భార్య ముక్కు కొరికేసిన భర్త... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 11 మే 2021 (08:30 IST)
కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్తకు పిచ్చిపట్టినట్టు అయింది. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కోపాన్ని నిగ్రహించుకోలేక పోయిన ఆయన.. భార్య ముక్కు కొరికేశాడు. ఈ దారుణం ముంబై మహానగరంలో జరిగింది. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్ (36), ప్రేరణ సైనీ (31) అనే దంపతులు ఉండగా, వీరికి 11 యేళ్ళ కుమార్తె వుంది. అయితే, ఇటీవల దంపతులిద్దరి మధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని విజేందర్ అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి ఆమెను వేధించ‌డం మొద‌లుపెట్టాడు. రోజురోజుకు భ‌ర్త వేధింపులు పెరిగిపోవ‌డంతో ప్రేరణ విసిగిపోయింది. అందుకే కూతురును వెంటబెట్టుకుని భర్తకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
 
ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లిన ప్రేరణను వెతుక్కుంటూ బయల్దేరిన విజేందర్ కూడా అక్క‌డికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్దాం ర‌మ్మ‌ని భార్య‌ను కోరాడు. కానీ అత‌నితో వెళ్లేందుకు ఆమె అంగీకరించలేదు. 
 
బంధువుల ముందు కూడా భార్య త‌న మాట విన‌క‌పోవ‌డంతో కోపంతో ర‌గిలిపోయాడు. అందుకే ఆ ఇంటి ద‌గ్గ‌రే మాటువేసిన విజేందర్‌ పాల ప్యాకెట్ కోసం భార్య బ‌య‌టికి రాగానే ఆమెను అనుస‌రించాడు. దాంతో ఆమె ఆటో ఎక్కి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అదే ఆటోను వెంబ‌డించి ఎక్కిన విజేంద‌ర్ భార్య ముక్కు కొరికేసి పారిపోయాడు.
 
బలంగా కొరకడంతో ప్రేర‌ణ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆస్ప‌త్రికి తరలించగా వైద్యులు 15 కుట్లు వేశారు. ఇదిలావుంటే భార్య ముక్కు కొరికి పారిపోతున్న విజేంద‌ర్‌ను స్థానికులు ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు. 
 
పోలీసులు విచారించ‌గా త‌న‌కు త‌న భార్య, పాప అంటే చాలా ఇష్టమని, వారిని విడిచి ఉండ‌లేన‌ని విజేంద‌ర్ చెప్పాడు. తాను కూతురు, భార్యతోనే తిరిగి ఢిల్లీకి వెళ్తాన‌ని, ర‌మ్మ‌ని ఎంత బ‌తిమాలినా విన‌క‌పోవ‌డంతోనే క్ష‌ణికావేశంలో ముక్కు కొరికాన‌ని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments