Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలుడిపై 15 మంది అబ్బాయిల గ్యాంగ్ రేప్..

చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. బాలికలపై కాకుండా అబ్బాయిలపై కూడా అత్యాచార అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల వయస్సున్న ఓ బాలుడిపై 15మంది బాలుర బృం

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (15:07 IST)
చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. బాలికలపై కాకుండా అబ్బాయిలపై కూడా అత్యాచార అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల వయస్సున్న ఓ బాలుడిపై 15మంది బాలుర బృందం గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత 2016వ సంవత్సరం 16 ఏళ్ల బాలుడిని.. ఓ బాలుడు రేప్ చేశాడు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. దీన్ని బయటికి చెప్తే వీడియోను లీక్ చేస్తానని బెదిరించాడు. 
 
కానీ ఈ వీడియోను రేపిస్ట్ బాలుడు తన స్నేహితులకు షేర్ చేశాడు. ఆపై రేపిస్ట్ స్నేహితులు కూడా బాధిత బాలుడిపై ఇటీవల మైదానంలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి అంగీకరించని బాధితుడిపై దాడి చేయడంతో పాటు డబ్బు కావాలని బెదిరించారు. వీరి చర్యలకు తాళలేని బాధిత బాలుడు సామాజిక సంక్షేమ కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధిత బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనిపై లైంగిక వేధింపులు జరిగిన మాట నిజమేనని తేలింది. ఆపై 15మంది బాలురుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం