Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌లో విషాదం : 9 మంది టూరిస్టుల మృతి

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (17:18 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా - చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందిన వారేనని అక్కడి అధికారులు చెప్పారు. 
 
ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడడంతో అది కుప్పకూలింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లలపై బండరాళ్ల పడ్డాయి. ఈ ఘటనలో పలు కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments