Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలకు కరోనా పరీక్షలు... జీరో టచ్ సెక్యూరిటీ : లోక్‌సభ స్పీకర్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:38 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు ఒకటో తేదీ వరకు జరిగే ఈ సమావేశాలను రెండు షిప్టుల్లో నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ సభ్యులందరికీ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. 
 
ఈ సమావేశాల ఏర్పాట్లలో భాగంగా, ఆయన శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, డీఆర్డీవో అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్వహణకు కోవిడ్-19 ప్రధాన సవాలు విసిరింది. కోవిడ్ సంబంధిత నియమ నిబంధనలను పాటించడం ద్వారా పార్లమెంటు సమావేశాలకు సభ్యులంతా సహకరిస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ఎంపీలతో పాటు పార్లమెంటు ఆవరణలో ప్రవేశించే అధికారుల నుంచి మంత్రులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ సిబ్బంది, రాజ్యసభ కార్యదర్శులంతా పార్లమెంట్ సమావేశాలకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, జీరో-టచ్ సెక్యూరిటీ తనిఖీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments