Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంవోలో విజయసాయిరెడ్డి.. మీడియాను చూసి పరుగో పరుగు.. ఎందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం ఎదురుచూస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే.. వైకాపా ఎంపీలు మోదీ దృష్టి తమపై పడాలని ఎగబడుతున్నారు. ఈ క్రమంల

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (14:24 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం ఎదురుచూస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే.. వైకాపా ఎంపీలు మోదీ దృష్టి తమపై పడాలని ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానిని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. పీఎంవోలో గంటపాటు నిరీక్షించారు. 
 
పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి మోదీ అపాయింట్‌మెంట్ కోసం వేచి వున్నారు. కానీ ఆ సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో వారిని చూసి విజయసాయి రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు విజయసాయి వెంట వైకాపా చీఫ్ జగన్ బంధువు వినీత్ రెడ్డి పీఎంవోలోకి వెళ్లారు. కాగా వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
 
కాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు ఇలా పాకులాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలకే విసుగొచ్చేలా విమర్శలు చేసే వైసీపీ విశ్వాస వాసి.. కత్తి మహేష్ విజయసాయి రెడ్డి పీఎంవోకు ఎందుకు వెళ్లారో స్పందించే సంతోషిస్తామని ఓ నెటిజన్ సెటైర్లు విసురుతూ.. విజయసాయి రెడ్డి ఫోటోను పోస్టు చేశాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments