Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కళ్ల ముందే... ఐదుగురు బిడ్డల తల్లిపై 17మంది సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (11:54 IST)
మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంట్లో వున్నా.. బయటకు వెళ్లినా.. భర్త తోడున్నా అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భర్త కళ్ల ముందే ఓ మహిళకు అన్యాయం జరిగింది. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. దుమ్కా జిల్లా ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం దంపతులు బయటకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమె భర్తపై దాడికి పాల్పడి నిర్బంధించారు. అతడి కళ్లముందే 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
 
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17మంది ఐదుగురు పిల్లల తల్లిపై దారుణమైన అత్యాచారం చేశారు. రోడ్డుపై నుంచి వేధిస్తూ.. ఇంటికి వచ్చిన ఆ జంటపై కామాంధులు దాడికి పాల్పడ్డారు. 35మహిళ ఇంటికి వెంబడిస్తూ రావడమే కాకుండా.. మరింత రెచ్చిపోయారు. బాధితురాలి భర్తను దారుణంగా కొట్టారు.

17మంది గుంపుగా వచ్చి మీద పడటంతో పాపం ఆ భర్త ఏమీ చేయలేకపోయాడు. కర్రలు, రాడ్లతో దౌర్జన్యం చేశారు. భర్తను వదలమని వేడుకుంది. కానీ ఆ దుర్మార్గులు కనికరించలేదు.

ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇదంతా భర్త ఎదురుగుండానే జరిగింది. ఈ ఘటనలో మహిళ స్పృహ తప్పి పడిపోయింది.  

సమాచారం అందుకున్న పోలీసులు.. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భర్త కళ్ల ముందే 17 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 

బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని చెబుతున్నారు. ఇక, ఆ 17 మంది నిందితులుగా ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నట్టుగా చెబుతున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ అంత దారుణ హింసకు గురైన ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments