Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో 26 పిల్లలకు జన్మనిచ్చిన కోబ్రా... హడలిపోయిన కుటుంబ సభ్యులు

Webdunia
శనివారం, 10 జులై 2021 (15:55 IST)
సాధారణంగా కోబ్రా (త్రాచు పాము)ను చూస్తే ప్రతి ఒక్కరూ వణికిపోతారు. అలాంటి కోబ్రా ఏకంగా ఇంట్లో చేరి 26 పిల్లలకు జన్మనిస్తే.... ఈ విషయం తెలిసిన ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎక్కడి నుంచి వ‌చ్చిందో, ఎలా వ‌చ్చిందోగానీ ఓ ఇంట్లో ఓ నాగుపాము స్వేచ్ఛగా నివాస స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టి పిల్లలను కూడా చేసింది. 
 
అది ఒకటి రెండు కాదు.. ఏకంగా 26 పిల్లలను చేసింది. అయినా కానీ ఆ ఇంట్లో వారికి పాము కంట‌ప‌డ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి హాని కూడా తలపెట్టలేదు.ఇన్నాళ్లూ గుట్టుచ‌ప్పుడు కాకుండా ఉన్న పాము శుక్రవారం.. ఆ ఇంటి య‌జ‌మాని కంట‌ ప‌డింది. 
 
దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ భయంతో పరుగులు తీశారు. ఇంటి య‌జ‌మాని ఫిర్యాదు తర్వాత అక్కడకు చేరుకున్న అట‌వీ సిబ్బంది ఆ తాచు పామును బంధించారు. ఆ పాముతోపాటు మొత్తం 26 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు.
 
త‌ల్లి పాముతోపాటు 26 పిల్లలను పట్టుకొని ఓ సంచిలో బంధించారు. ఆ తర్వాత స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేసినట్లు కలహండి అటవీ శాఖ స్నేక్ క్యాచర్ బీరేంద్ర కుమార్ సాహు వెల్లడించారు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశా రాష్ట్రం క‌ల‌హండి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments