Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్ర

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (12:56 IST)
పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్రకటించి యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణాలిచ్చింది. ఈ ఘటన కోల్‌కతాలోని కాశీపుర్ ప్రాంతంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో యజమాని ఇంటిలోకి చొరబడిన దొంగలపై వానరం దాడికి దిగింది. పావురాలను దొంగలించేందుకు వచ్చిన వారికి చుక్కలు చూపించింది. కాశీపూర్‌లో విక్కీ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో కొన్ని పావురాలతో పాటు ఈ వానరాన్ని కూడా పెంచుకుంటున్నాడు. 
 
కానీ పావురాలను దొంగలించేందుకు ఇంట్లోకి దొంగలు పడ్డారు. వీరిని గమనించిన వానరం వారితో పోటీపడి పావురాలను కాపాడింది. దీంతో వారు పావురాలను తీసుకెళ్లలేకపోయారు. కానీ వానరాన్ని మాత్రం దొంగలు చంపేశారు. దీంతో యజమాని కలతచెంది, ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments