Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి మంటల్లో కాలిపోతుంటే పెళ్లి పీటలపై కుమార్తె... తిరువనంతపురంలో ప్రేమ వివాహ విషాదం!

పెళ్లి పీటలపై కుమార్తె కూర్చొనివుంటే.. ఆ వధువు తల్లి మాత్రం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మంటల్లో కాలిపోతూ ఉన్నది.

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (14:59 IST)
పెళ్లి పీటలపై కుమార్తె కూర్చొనివుంటే.. ఆ వధువు తల్లి మాత్రం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మంటల్లో కాలిపోతూ ఉన్నది. పెళ్లి చేసుకుని తన భర్తతో ఇంటికి వచ్చిన వధువుకు సగం కాలిన గాయాలతో ఉన్న తల్లిని చూడగానే నిశ్చేష్టురాలై కుప్పకూలిపోయింది. ఈ విషాదకర సంఘటన కేరళ రాష్ట్రంలోని పూన్‌కుళం అనే ప్రాంతంలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే....
 
పూన్‌కుళం ప్రాంతానికి చెందిన సునీతకు అనే మహిళకు కార్తీక అనే 19 యేళ్ళ కుమార్తె ఉంది. ఈ మధ్యనే కుమార్తెకు పెళ్లీడు రావడంతో ఇటీవలే ఓ ఆర్మీ సంబంధాన్ని సునీత తీసుకొచ్చింది. అయితే, కార్తీక అప్పటికే ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీంతో తన ప్రేమ విషయాన్ని నేరుగా తనను చూసేందుకు వచ్చిన కుర్రోడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ యువకుడు సంబంధం వద్దనుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సునీత తీవ్ర మనస్థాపానికి గురైంది. కుమార్తె భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంది. 
 
ఇంతలోనే... కార్తీక తాను ప్రేమించి కుర్రోడితో లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించింది. ఈ విషయం వరుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఇకేం చేయాలో తోచని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించగా, ఇరు కుటుంబాల వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించారు. 
 
ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల పెళ్లికి హాజరయ్యారు. కానీ, వధువు తల్లి మాత్రం హాజరుకాలేదు. పెళ్లి సమయానికి సునీత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పెళ్లి జరిగిన తర్వాత ఇంటికొచ్చిన కార్తీక తల్లిని చూసి కుమిలికుమిలి ఏడ్చింది. అప్పటికే దాదాపు శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే సునీతను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments