Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్యాసిగా వద్దన్నాను.. నేడు ప్రధానిగా రమ్మంటున్నా : మోడీకి గురువు లేఖ

Webdunia
సోమవారం, 4 మే 2015 (13:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన గురువు బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ మహారాజ్ ఓ లేఖ రాశారు. గత కొంతకాలంగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మోడీకి ఓ లేఖ రాశారు. 
 
చివరిసారిగా మోడీ తన గురువును 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. అనంతరం ప్రధాని అయ్యాక తమ ఆశ్రమానికి రావాల్సిందిగా బేలూర్ మఠం నుంచి మోడీకి లేఖ పంపించారు. యవ్వనంలో నాడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు నేడు ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉంది అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
 
అయితే, గత కొంతకాలంగా తీరిక లేకుండా ఉన్న మోడీ ప్రస్తుతం కాస్త విరామం తీసుకుని శనివారం బేలూరు మఠానికి వెళ్లనున్నారు. దీనిపై మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్నందా మహారాజ్ మాట్లాడుతూ 'మోడీగారూ ఆత్మస్థానంద్ మహారాజ్ను గురువుగారిగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆస్పత్రిలో ఉంటున్నారు. రాజ్‌కోట్లో కలిసి ఉన్నప్పుడు ఆత్మస్థానంద్ మహారాజ్గారి సలహాలు మోడీ తీసుకునేవారు' అని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments