Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తిలా ఉన్నావ్... హీరోయిన్‌గా మీరు నటించిన చిత్రాలు నేను చూడలేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటిదూల!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (12:08 IST)
ఓ జిల్లా కలెక్టర్‌ను చూసి సినీహీరోయిన్‌లా ఉన్నారని, కానీ ఇంతకుముందు మీరు నటిస్తుండగా తెరమీదెన్నడు చూడలేదని సంచలన వాఖ్యలు చేసి కలకలం సృష్టించిన కాంగ్రేస్ ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సర్‌గుజాలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్జీత్‌ భగత్ పాల్గొన్నారు. ప్రజలగురించి ప్రస్తావిస్తాడనుకుంటే... కలెక్టర్ రితూ సేన్‌ గురించి సెక్సీ వాఖ్యలు పలికారు. 
 
ఇంతకీ ఏమన్నాడో తెలుసా... సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి.. ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఇంతవరకువరకు చేసిన వాఖ్యలు చాలవన్నట్టు తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్‌లాంటి పిచ్చివాడిని చూడలేదని చెప్పి అందరకి షాక్ నిచ్చారు. 
 
సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భగత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై మండిపడిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను అడ్డగించడం, కలెక్టర్, మంత్రులపై అసభ్యపదజాలం వాడినందుకు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం