Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్రాలో దారుణం.. 15 ఏళ్ల బాలికను రేప్ చేసిన స్కూల్ డైరక్టర్.. వీడియో తీసి వాట్సాప్‌లో అప్‌లోడ్

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికను రేప్ చేసిన ఓ కామాంధుడు... ఆపై వీడియో తీసి దాన్ని వాట్సాప్‌లో అప్ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది.. ఓ స్కూల్ డైరక్టరే కావడం గమనార్హం.

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (10:49 IST)
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికను రేప్ చేసిన ఓ కామాంధుడు... ఆపై వీడియో తీసి దాన్ని వాట్సాప్‌లో అప్ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది.. ఓ స్కూల్ డైరక్టరే కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆగ్రా, బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్‌గా జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన కామాంధుడిగా అవతారమెత్తాడు. తమ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసే 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికను రేప్ చేశాడు. అంతటితో ఆ కామాంధుడి అహం చల్లారలేదు. ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్‌లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. 
 
ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ బాలిక దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని ఆమె తెలిపింది. అతని ఉచ్చులో చిక్కుకుని 20 మందికి పైగా బాలికలు నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక వెల్లడించింది. పరారీలో ఉన్న కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments