Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై 8 నెలల పాటు అత్యాచారం.. కన్నతండ్రే నరకం చూపించాడు: గర్భవతి-ఆపై బిడ్డ!

వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. చిన్నాపెద్దా, తండ్రి కుమార్తె తేడా లేకుండా.. కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ఓ తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిర

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:38 IST)
వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. చిన్నాపెద్దా, తండ్రి కుమార్తె తేడా లేకుండా.. కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ఓ తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి.. ఎనిమిది నెలల పాటు ఆమెకు నరకం చూపించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మంగళూరు సమీపంలోని సూరత్కల్ పట్టణంలో చోటుచేసుకుంది. 
 
సూరత్కల్‌లోని శశితలు ప్రాంతానికి చెందిన వామన బంగేరా అనే వ్యక్తికి ఓ మైనర్ కుమార్తె ఉంది. కానీ కామంతో కళ్లు మూసుకుపోవడంతో ఆ దుండగుడు కన్నకూతురిపైనే కన్నేశాడు. భార్య ఇంట్లో లేని సమయాన్ని అదనుగా తీసుకుని కుమార్తెను బెదిరించి గత ఎనిమిది నెలల నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్య కారణంగా మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని కూడా ఆ బాలిక గుర్తించలేకపోయింది. 
 
ఈ విషయాన్ని బయట చెపితే.. తల్లిని చంపేస్తానని.. ఆపై బాలికను కూడా చంపేస్తానని బెదిరించడంతో నోరు విప్పలేకపోయింది. కానీ కడుపునొప్పి కారణంగా బాలికను ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ మైనర్ బాలికను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. అయినా మైనర్ బాలిక తన గర్భానికి కారణం ఎవరో భయంతో నోరు విప్పలేదు.
 
కానీ మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణలో తన తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడిందన్న విషయాన్ని వెల్లడించింది. ఇంతలోనే బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిందని, పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం