Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం.. హత్య.. ఇసుకతో..?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (22:49 IST)
వయోభేదం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లోని బంకాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని పోలీసులు ఓ గుహలాంటి ప్రదేశంలో ఇసుకతో కప్పి వుండగా వెలికి తీశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. హోలీ పండగ రోజున తన స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారి  కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. 
 
చిన్నారితో ఆడుకుంటున్న మరో బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం... చిన్నారిని ఓ ఎరుపు రంగు ఈ-రిక్షాలో తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు డ్రైవర్​ సాగర్​ సోనీని కనుగొన్నారు.
 
ఈ ఘటనతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని రిక్షా డ్రైవర్​ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా చిన్నారిపై అత్యాచారం హత్య జరిగినట్లు తేలింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రిక్షా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments