గెస్ట్ హౌస్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు.. మేఘాలయ ఎమ్మెల్యే అరెస్ట్..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై, మహిళలపై కామాంధుల అకృత్యాల సంఖ్య పెరిగిపోతూనే వున్నాయి. అయితే అత్యాచారం కేసులో ఓ ప్రజా ప్రతినిధి చిక్కుకున్నాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (16:20 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై, మహిళలపై కామాంధుల అకృత్యాల సంఖ్య పెరిగిపోతూనే వున్నాయి. అయితే అత్యాచారం కేసులో ఓ ప్రజా ప్రతినిధి చిక్కుకున్నాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తే ప్రజల పట్ల రాక్షసుడిగా మారాడు. తాజాగా మేఘాలయాకు చెందిన ఓ స్వతంత్ర ఎమ్మెల్యే బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే, 14 ఏళ్ల బాలికపై స్వతంత్ర్య ఎమ్మెల్యే జూలియస్‌ కె.డోర్పాంగ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం నుంచి పరారీలో ఉన్న ఇతనని  శనివారం ఉదయం గర్చుక్‌ ప్రాంతంలో మేఘాలయ, అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానిక కోర్టు జూలియస్‌పై  నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.
 
గత నెలలో.. ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి కుమారుడికి చెందిన ఓ అతిథి గృహానికి ఉద్యోగికి ఒకరిని.. బాలికను సరఫరా చేసిన కేసులోనూ ఇతడు అరెస్టైనాడు. దీంతో ఎమ్మెల్యే అత్యాచార కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలైన బాలికను గెస్ట్ హౌస్ నుంచి పోలీసులు కాపాడారు. ఆపై బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments