#RakshaBandhan : 20 యేళ్లుగా మోడీకి రాఖీ కడుతున్న పాకిస్థాన్ చెల్లి.. ఎవరు?

రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ చెల్లెలు ఒకరు రాఖీ కట్టారు. రాఖీ కట్టడమంటే ఒకటి రెండు సార్లు కాదు. గత 20 యేళ్లుగా క్రమం తప్పకుండా మోడీ అన్నయ్యకు పాక్ సోదరి రాఖీ కడు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (16:22 IST)
రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ చెల్లెలు ఒకరు రాఖీ కట్టారు. రాఖీ కట్టడమంటే ఒకటి రెండు సార్లు కాదు. గత 20 యేళ్లుగా క్రమం తప్పకుండా మోడీ అన్నయ్యకు పాక్ సోదరి రాఖీ కడుతూ వస్తోంది. ఇంతకీ పాక్ చెల్లెలు వివరాలేంటో తెలుసుకుందాం... 
 
పాకిస్థాన్‌లో జన్మించిన ఖమార్ మొహసిన్ షేక్ తాను భారతీయురాలినేనని గర్వంగా చెబుతుంది. పెళ్లయిన తర్వాత ఆమె భారత్ వచ్చేసింది. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటోంది. ఆమె తొలిసారిగా నరేంద్ర మోడీకి ఆయన ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడు రాఖీ కట్టారు. 
 
ఈ సందర్భంగా మొహసిన్ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ‘నేను పెళ్లయిన తర్వాత పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చాను. ఇక్కడ నాకు బంధువులెవరూ లేరు. నేను నా భర్తతో కలిసి మోడీని కలిశాను. అప్పుడు ఆయన ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉండేవారు. రక్షాభంధన్ రోజునే మోడీని కలుసుకోవడం జరిగింది. దీంతో వెంటనే మోడీకి రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యాను. ఆయన ఎంతో ఆనందంగా తన చేతిని చాపి రాఖీ కట్టించుకున్నారు. 
 
అప్పుడే మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం బలపడింది. అప్పటి నుంచి ప్రతీ యేటా మోడీకి రాఖీ కడుతూ వస్తున్నాను. ఎన్నో పరిణామాల తరువాత మోడీ.. ప్రధాని స్థాయికి ఎదిగారు. అయినా మా అనుభంధం మారిపోలేదు. అయితే ఈ సారి మోడీ చాలా బిజీగా ఉన్నారు. అయినా రెండు రోజుల క్రితం ఆయన ఫోన్‌చేసి క్షేమ సమాచారం అడిగి, రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments