Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య సిబ్బంది మా హోటల్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు: సోనూ సూద్

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:40 IST)
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూ సూద్  తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్‌ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.

కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సిబ్బంది తన హోటల్లో ఉండొచ్చని చెప్పాడు.

ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపాడు.

‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి  చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి.

అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా, ముంబై లోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments