Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:12 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది.
 
నిన్న 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్ల మార్కును దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 0.48 శాతానికి పడిపోయింది.

ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ మృతుల సంఖ్యను సవరిస్తోంది. దాంతో నిన్న 356 మరణాలు నమోదుకాగా.. మొత్తంగా 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 64,75,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 102.94 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments