Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 49కు చేరింది. వీరిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహితాష్ లాంబా అనే జవాను కూడా ఉన్నాడు. ఈ జవానుకు సరిగ్గా ఒక యేడాది క్రితం పెళ్లి జరుగగా, మూడు నెలల క్రితం పాప పుట్టింది. ఈ పాపను ఒక్కసారి కూడా లాంబా చూడలేదు. ఈ ఈ నెలాఖరులో ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై లాంబా స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ, కుమార్తెను చూసేందుకు రోహితాష్ హోలీ పండుగకు రావాల్సివుంది. అయితే ఇంతలోనే అతను ఉగ్రదాడికి బలయ్యాడు. అతని మరణవార్త విన్నాక అతని ఇంటిలోనేకాకుండా గ్రామమంతటా విషాదం నెలకొంది. అతని ఇంట్లో పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్న సమయంలో శ్రీనగర్ నుంచి వచ్చిన ఫోను రోహితాష్ ఇంట్లో విషాదాన్ని నింపేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్ మేజర్ ఫోనులో ఈ విషయాన్ని రోహితాష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. రోహితాష్ మరణవార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర కుప్పకూలిపోయాడనీ, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments