పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (18:08 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భీమన అమావాస్య సందర్భంగా భర్తకు పాదపూజ చేసింది. కానీ, ఆ పతి దేవుడు మాత్రం ఏమాత్రం కనికరించలేదు. వీటికేం తక్కువ లేదు.. తేవాల్సిన కట్నం జాడ మాత్రం కానరాదు అంటూ ఆయన దెప్పిపొడుస్తుందంటే పంటి బిగువునే తన బాధను అణుచుకుంది. తన బాధనంత తోడపుట్టిన సోదరితో పంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది. 
 
భీమన అమావాస్య సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఎంతో భక్తితో పూజలు చేసి కుటుంబం సంప్రదాయం ప్రకారం కంకణం కట్టుకుని భర్తకు పాదపూజ చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత భర్త చీటిపోటి మాటలు అన్నారు. వీటన్నింటిని తన బాధను అణుచుకుంది. మధ్యాహ్నం చెల్లితో తన బాధనంతా పంచుకుంది. ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే దానికి అభిషేక్‌తో పాటు ఈ ఇంటి వారందరికీ పాపం ఉన్నట్టే అంటూ సెల్‌ఫోన్‌ చాటింగ్‌లో వాపోయింది. అలాంటిదేమీ ఉండదులే అక్కా అని చెల్లి సర్దిచెప్పినా, పరిస్థితి చేయిదాటిపోయింది. 
 
రాత్రి 8.30 గంటలకంతా ఆ ఇంట మృత్యుగంట మోగింది. పెళ్ళయిన యేడాదిలోపే ఆమె ఊపిరి వదిలింది. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య స్పందన (22)ను గురువారం రాత్రి హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆరోపణలపై అభిషేక్ అనే వ్యక్తిని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భార్యతో పాదపూజ చేయించుకుని చివరికి కట్నం కోసం హత్య చేశాడని స్పందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు ఉరి బిగించి హత్య చేసి, ఆత్మహత్యగా చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments