Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పక్కనే వున్న ప్రియుడితో వివాహిత, భర్త-ప్రియుడు ఇద్దరూ బలి

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:43 IST)
కర్ణాటకలో ఘోరం జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా భర్తతో పాటు ప్రియుడు బలయ్యాడు. పచ్చటి సంసారాన్ని నిట్టనిలువునా కూల్చేసుకుంది ఒక మహిళ. చివరకు కటాకటాల పాలైంది.
 
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా టి. నరసీపుర తాలూకా హోరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు అనే యువకుడికి సంవత్సరం క్రితం 26 యేళ్ళ యువతితో వివాహమైంది. సిద్థరాజు స్థానికంగా ప్లంబర్ పనిచేసేవాడు. ఇద్దరి జీవితం సాఫీగానే సాగిపోయేది. 
 
అయితే ఇంటి పక్కనే ఉన్న మహదేవ అనే యువకుడితో ఆ వివాహితకు రెండునెలల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంటి నుంచి వెళ్ళగానే ఆమె ప్రియుడితో కలిసి ఇంటిలోనే ఆ సంబంధాన్ని కొనసాగించింది. 
 
ఇరుగుపొరుగు ద్వారా అసలు విషయం భర్తకు తెలిసింది. నెలరోజుల క్రితం ఆమెను మందలించాడు సిద్థరాజు. అయితే ఆమెలో మార్పు రాలేదు. తన సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి చంపేందుకు నిర్ణయించుకుంది.
 
మూడురోజుల క్రితం సిద్థరాజు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడు మహదేవ, అతని స్నేహితుడి సహాయంతో వివాహిత భర్తను చంపేసింది. అయితే ఏమీ ఎరుగనట్లు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో మహిళపైనే అనుమానం రావడంతో ఆమెను గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం ఒప్పుకుంది.
 
మహదేవపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గరికి పోలీసులు వస్తారని తెలుసుకున్న మహదేవ భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు ఆ మహిళ కటాకటాల్లో ఊచలు లెక్కిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments