Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చూద్దామని వెళ్లిన అమ్మాయి మెడలో తాళి కట్టిన వరుడు...

మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్... ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలనేది దేవుడు ఎప్పుడో నిర్ణయించేస్తాడు. అందుకే కొన్నిసార్లు పెళ్లి పీటలపైకి ఎక్కిన తర్వాత కూడా పెళ్లి పెటాకులవుతుంది. తేడా కొట్టిన తర్వాత కొన్నాళ్లకు మరొకరితో పెళ్లవుతుంది. కొన్ని పెళ్లిళ్లయితే

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (18:34 IST)
మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్... ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలనేది దేవుడు ఎప్పుడో నిర్ణయించేస్తాడు. అందుకే కొన్నిసార్లు పెళ్లి పీటలపైకి ఎక్కిన తర్వాత కూడా పెళ్లి పెటాకులవుతుంది. తేడా కొట్టిన తర్వాత కొన్నాళ్లకు మరొకరితో పెళ్లవుతుంది. కొన్ని పెళ్లిళ్లయితే పెళ్లి పందిరిలోనే పెళ్లికుమారుడు లేదా పెళ్లి కుమార్తెతో కాకుండా మరొకరితో జరిగిపోతుంది. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... తిరుచ్చిలోని తురైయూర్ గ్రామానికి చెందిన వెంకటేశన్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి అదే జిల్లాలో వున్న యువతితో పెళ్లి నిశ్చయమైంది. బంధువులు, స్నేహితులు అంతా పెళ్లికి వచ్చేశారు. వరుడు మరికొద్ది సేపట్లో వధువు మెడలో తాళిబొట్టు కడతాన్న సమయంలో.... ఆపండి.. అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 
 
సదరు యువతికి ఇంకా మైనారిటీ తీరలేదు కనుక పెళ్లి చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. దీనితో పెళ్లి కుమారుడు తరపువారికి ఏం చేయాలో అర్థంకాలేదు. దీనితో పెళ్లి చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయిని ఒప్పించి వరుడు పక్కనే కూర్చోబెట్టి ఆమెనిచ్చి పెళ్లి చేసేశారు. వరుడు అలా తన పెళ్లి చూసేందుకు వచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments