Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ ఆస్తులన్నీ నాకేనన్న కృష్ణమూర్తి అరెస్ట్‌? ఇక ఊచలు లెక్కబెట్టాల్సిందేనా?

దివంగత సీఎం జయలలిత కుమారుడినని.. సీన్లోకి వచ్చిన జె.కృష్ణమూర్తిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ తెలుగు నటుడు శోభన్ బాబు, జయలలితలకు తాను జన్మించానని.. 1986లో సినిమా షూటింగ్ కోసం ఈరోడ్డు వచ్

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (15:50 IST)
దివంగత సీఎం జయలలిత కుమారుడినని.. సీన్లోకి వచ్చిన జె.కృష్ణమూర్తిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ తెలుగు నటుడు శోభన్ బాబు, జయలలితలకు తాను జన్మించానని.. 1986లో సినిమా షూటింగ్ కోసం ఈరోడ్డు వచ్చిన సందర్భంగా తనను వసంతమణి అనే మహిళకు అప్పగించినట్లు కృష్ణమూర్తి తెలిపాడు. ఇంకా జయలలిత ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
 
అయితే కృష్ణమూర్తి కోర్టును మాత్రమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సమర్పించాడని కోర్టు ఫైర్ అయ్యింది. అంతేగాకుండా జయలలిత-శోభన్ బాబు కుమారుడవని చెప్తే ఎవరైనా నమ్ముతారా అంటూ సీరియస్ అయ్యింది. వార్తల్లో నిలవడం కోసం ఇలాంటి ఫోర్జరీలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జయ ఆస్తులు తనకే చెందుతాయంటూ పిటిషన్ దాఖలు చేసిన జె.కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా.. జయ ఆస్తులు తనకే చెందుతాయని దత్తత వీలునామాకు సంబంధించిన ఓ కాపీని కూడా కృష్ణమూర్తి పిటిషన్‌లో దాఖలు చేశాడు. అందులో మాజీ సీఎం ఎంజీఆర్ సాక్షిగా సంతకం చేసినట్లుంది. అయితే ఇవన్నీ ఫోర్జరీలేనని కోర్టు తేల్చేసింది.  

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments