ప్రియురాలికి నుదుట రక్తందిద్ది మరీ హత్య చేసిన ప్రియుడు...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:31 IST)
తనను నెలల తరబడి ప్రేమించి, చివరకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. పైగా, ప్రియురాలి నుదుట కుంకుమదిద్ది మరీ హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీకి చెందిన అరుణ్ గుప్తా (21), ముంబైకి చెందిన ప్రతిభా ప్రసాద్‌కు యేడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా పరిచయం ఏర్పడటంతో అది తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్ళి చేసుకునేందుకు తనతో రావాలంటూ ప్రియుడు కోరారుడు. కానీ, ఆ ప్రియురాలు మాత్రం ససేమిరా అన్నది. దీంతో ప్రియుడు ఆగ్రహించాడు. 
 
ఈ క్రమంలో వారణాసికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన అరుణ్ గుప్తా, ముంబైకి వచ్చి, కల్యాణ్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన వీరిద్దరూ శనివారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. దీంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. 
 
ఆ తర్వాత పోలీసులు వచ్చి చూడగా, ఇద్దరూ విగతజీవులై పడివున్నారు. బ్లేడ్‌తో తన చేతికి గాయం చేసుకుని, ఆమె నుదుటన సింధూరంలా దిద్ది, సెల్ఫీలు దిగి, ఆపై ప్రతిభను గొంతుపిసికి హత్య చేసిన అరుణ్, సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments