Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు భార్యలకు ముద్దుల మొగుడు.. మూడేసి రోజులు ఇద్దరితో.. ఆదివారం ఆయనిష్టం!

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (09:36 IST)
సంస్కృతికి అద్దం పట్టే శ్రీరాముడి ఏకపత్నీ వ్రతం కనుమరుగు అవుతోంది. కలియుగం కారణంగా వివాహేతర సంబంధాలు ఒక వైపు.. ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వంటి సాధారణమైపోయింది. తాజాగా ఓ వ్యక్తి ఇద్దరు భార్యలకు ముద్దుల మొగుడుగా మారాడు. కోర్టు కూడా ఆయనకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య వద్ద మూడు రోజులు వుండాలని.. ఆదివారం మాత్రం ఆయనకు ఇష్టం వున్న వుండవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్‌తో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై భర్త వస్తాడనుకుంది. కానీ ఆయన రాలేదు. భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి జీవితం సాఫీగా సాగింది.

ఇంతలో మొదటి భార్య హర్యానాకు వచ్చింది. భర్త రెండో పెళ్లి చేసుకోవడం తెలిసి షాకైంది. తర్వాత గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్‌తో ఓ నిర్ణయానికి వచ్చింది. సదరు వ్యక్తి భార్యలు ఇద్దరు అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది.
 
ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments