Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్‌పై మత్తు చల్లి... మైనర్ బాలికపై బలాత్కారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:52 IST)
అభంశుభం తెలియని మైనర్లు కూడా కామాంధుల కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. ఈ కామాంధులు ఆటలు కట్టించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితంగా మాత్రం శూన్యంగానే ఉంది. తాజాగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అదీకూడా.. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ లేబర్ కాంట్రాక్టర్... తన వద్ద పని చేసే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. అందుకే.. ఆమెకు ఓ కొత్త మాస్క్ కొనిచ్చాడు. ఈ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. 
 
ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments