Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుతీర్చలేక భార్యను సొంత అన్నకే తాకట్టు పెట్టిన భర్త.. ప్రాణాపాయ స్థితిలో?

Webdunia
గురువారం, 2 జులై 2015 (18:56 IST)
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన హర్యానాలోని భివాండీలో చోటుచేసుకుంది. అప్పుతీర్చలేక ఓ భర్త.. తన భార్యను సొంత అన్నకే తాకట్టు పెట్టాడు. వారి కామదహనానికి బలైన ఆ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. భివాండీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ తన అన్నయ్య విజయ్ దగ్గర రూ.25వేల రూపాయలు బకాయీ పడ్డాడు. 
 
అప్పు తీర్చాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో చేసేది లేక తన భార్యనే కుదువపెట్టేశాడు. దీనిని అవకాశంగా మలుచుకున్న విజయ్, అతని స్నేహితుడు హర్కీష్ ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. వారి ప్రయత్నాన్ని పసిగట్టిన ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, మంచానికి కట్టేసి, మత్తు మందులు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. 
 
నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ మహిళ పుట్టింటికి సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను విడిపించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కామాంధులకు బలైపోయిన ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇకపోతే.. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు