Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడ్రన్ డ్రెస్సులేసుకుంటోందని నిండుగర్భిణిని చంపేసిన భర్త

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (16:06 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు. గర్భవతి అని కనికరించకుండా కిరాతకంగా చంపేశాడు. భార్య తనకు నచ్చినట్లు ఉండాలని, భర్త తన చెప్పినట్లు వినాలని మొండికేసిన భర్త.. ఆపై భార్య అలా వుండనని తేల్చి చెప్పేయడంతో హతమార్చాడు. తనకు నచ్చని విధంగా డ్రెస్ వేసుకుందన్న కారణంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
హాసన్ జిల్లాలోని రాంపుర గ్రామస్థులు మాత్రం షాక్‌లో ఉండిపోయారు. ఇదే గ్రామంలో ఓ తోటలో ఓ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. తీరా చూస్తే అరసికెరెలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జ్యోతి అని గుర్తించారు. 
 
ప్రాథమిక విచారణలో జ్యోతి భర్త జీవన్ గురించి ఆరా తీయగా.. పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో జీవన్ ఆమెను చంపినట్లు నిర్ధారించారు. వీరిది ప్రేమ వివాహం. 
 
షాపింగ్‌, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆమె మోడ్రన్ డ్రెస్‌లు ధరిస్తుండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తనకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవడం లేదన్న అక్కసుతో ఆమెపై కోపాన్ని పెంచుకుని.. పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి హతమార్చాడు. 
 
పుట్టింటికి వెళ్లేటప్పుడు కూడా ఆమె మోడ్రన్ డ్రెస్ వేసుకోవడంతో కోపాన్ని దిగమింగుకున్న భర్త..  ఓ తోటలోకి తీసుకెళ్లి.. గొంతు కోసి చంపేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అతడు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం