Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో నిశ్చితార్థం ... మరొకరితో ప్రేమ - ఇద్దరికీ పిల్లలు పుట్టాక పెళ్లి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (13:41 IST)
ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించి గర్భవతిని చేశాడు. వీరిద్దరూ ఆడబిడ్డలనే ప్రసవించారు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలిసి పంచాయితీ పెట్టి, ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా కేశ్‌కాల్‌కు సమీపంలోని ఉమ్లా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్‌ సింగ్‌ సలామ్‌కు ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్‌ అనే యువతితో ముందుగా నిశ్చితార్థం అయింది.  దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె కొద్ది నెలల తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. 
 
ఆ తర్వాత కొద్ది రోజులకు అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి గోటా అనే యువతిని రంజన్‌ ప్రేమించాడు. ఈ క్రమంలోనే సన్నో గర్భం దాల్చింది. ఆమె సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రంజన్‌ సింగ్‌ కుటుంబంతో మాట్లాడారు. 
 
గ్రామంలో పంచాయితీ సైతం నిర్వహించారు. ఇద్దరు యువతులు రంజన్‌ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. అందుకు పెద్దలు సైతం ఒప్పుకోవడంతో ఒకే వేదికపై ఈ నెల 8న రంజన్‌ సింగ్‌ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments