Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కు తీర్చుకునేందుకు అమ్మవారికి యువకుడిని బలిచ్చిన తండ్రి... ఎక్కడ?

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:35 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెవా జిల్లాలో సర్‌మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన మగబిడ్డ కోసం ఓ వ్యక్తి పొరుగు గ్రామానికి చెందిన యువకుడుని బలిచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాంలాల్ ప్రజాపతి అనే వ్యక్తి తన భార్యతో కలిసి సర్‌మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు జన్మించారు. అయితే, కొడుకు పుట్టాలని ప్రజాపతి ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. 
 
తనకు నాలుగో సంతానంగా కుమారుడు పుడితే ఓ యువకుడిని బలిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడు. యాదృచ్ఛికంగానే వారికి నాలుగో కుమారుడుగా కుమారుడు జన్మించాడు. తాను అమ్మవారిని ప్రార్థించడం వల్లే కుమారుడు పుట్టాడని ప్రజాపతి బలంగా నమ్మాడు. 
 
దీంతో తన మొక్కును తీర్చుకునేందుకు ఓ యువకుడి కోసం గాలించాడు. చివరకు పొరుగు గ్రామానికి చెందిన 19 యేళ్ల యువకుడికి మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్ళాడు. 
 
అదే రోజు రాత్రి తన గ్రామంలో అమ్మవారి ఆలయంలో యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు మరుసటి రోజు ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాంలాల్ ప్రజాపతిని కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments