Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు పుట్టిన రోజు పార్టీకిరాని నానమ్మను హతమార్చిన మనవడు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:45 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొడుకు పుట్టాడన్న ఆనందంలో చేసుకుంటున్న పార్టీకి రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి... తన నానమ్మను హత్య చేశాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫతేబాద్‌ పట్టణానికి చెందిన రామ్‌దేవి (70), రామ్‌ అవతార్‌ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొడుకులకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో తనకు కుమారుడు పుట్టాడని, ఇపుడైనా ఇంటికి రావాలని నానమ్మ - తాతలను మనవడు విక్కీ ఆహ్వానించాడు. పైగా, తమకు కుమారుడు పుట్టిన ఆనందంలో పార్టీ జరుపుకుంటున్నామనీ, ఈ పార్టీకి వచ్చి ఆనందించాలని కోరాడు. అయితే, తాము తాము వచ్చే ప్రసక్తే లేదని నానమ్మ రామ్‌దేవి స్పష్టం చేసింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన విక్కీ.. నానమ్మ రామ్‌దేవి ఇంటికి వచ్చి ఐరన్‌ రాడ్డుతో ఆమె తలను పగులగొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో రామ్‌ అవతార్‌ తన మనుమడు, కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు.. విక్కీ అతడి తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి తండ్రి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments