బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (09:09 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడిన ఓ భర్త.. బైకుతో పాటు బావిలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజురీబాగ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుందర్ కర్మాలి (27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని మోటారు సైకిల్‌ను బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడటంతో అతన్ని రక్షించాలని మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. ఈ ఘటనలో సుందర్ కర్మాలితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
మృతులను రాహుల్ కల్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తిని కాపాడబోయి నలుగురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments