కరోనా ఒకవైపు కామాంధులు మరోవైపు.. విమానంలో నడుము చుట్టూ చెయ్యేసి?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (15:31 IST)
ఓ వైపు విమానాశ్రయాల్లో కరోనా ప్రభావంతో బిజీ బిజీగా వుంటే.. రువాండా ఎయిర్‌పోర్ట్ నుంచి విమానమెక్కిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విమానంలో అందరూ గాఢ నిద్రలో వుంటే.. అంకిత్ పటేల్ అనే వ్యక్తి రువాండ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో మహిళను వేధింపులకు గురిచేశాడు. ఎదురుగా ఉన్న సీటు లోంచీ మెల్లిగా తన చేతిని అమ్మాయి దగ్గరకు పోనిచ్చాడు. ఏదో పాకినట్లు అనిపించడంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. 
 
ఏదైనా పురుగు పాకిందేమో అనుకొని నడుం వైపు చూసుకుంది. అక్కడ ఏమీ లేదు. చుట్టూ చూస్తే అంతా నిద్రపోతున్నారు. సరే అని నిద్రలోకి జారుకుంది. రెండోసారి కూడా అంకిత్ అలానే చేశాడు. కానీ అమ్మాయి కళ్లు తెరిచి చూసేలోపు అందరూ నిద్రపోతున్నారు. ఈసారి బాధితురాలు నిద్రపోయినట్లు నటించింది. కానీ అంకిత్ పటేల్ మాత్రం మళ్లీ అదే పని చేశాడు. తన చేతిని ఆమె నడుం చుట్టూ పోనిచ్చాడు. 
 
అంతే టక్కున నిద్రలేచిన అమ్మాయి.. అంకిత్‌ను పట్టుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌హోస్టెస్ వద్ద తెలిపింది. ముంబైలో విమానం ల్యాండ్ అయ్యీ అవ్వగానే... వేగంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అంకిత్ పటేల్ అక్కడ కనిపించకుండా తప్పించుకోవాలని చూశాడు. ముంబై పోలీసులకు విషయం తెలియడంతో మొత్తం ఎయిర్‌పోర్ట్‌ను అలెర్ట్ చేశారు. ఓ మూల నక్కిన అకింత్ పటేల్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం