Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం డబ్బులు అడిగిన యువతిని మాల్ పైఫ్లోర్‌కు తీసుకెళ్లి...

చేసిన పనికి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగినందుకు ఓ ఇంటి యజమాని ఓ యువతి మెడ కోశాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (12:51 IST)
చేసిన పనికి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగినందుకు ఓ ఇంటి యజమాని ఓ యువతి మెడ కోశాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ముంబై, భందూప్‌కు చెందిన 19 ఏళ్ల కాజల్ షిండే సమ్మర్ సెలవుల్లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించింది. అందులోభాగంగా తన సోదరితో కలిసి ఓ సంస్థలో టెలికాలర్‌గా చేరింది. హెచ్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీంతో ఉద్యోగం మానేస్తున్నట్టు టీమ్ లీడర్ అంకిత్ గైక్వాడ్ (23)కు చెప్పి జూన్ నుంచి ఉద్యోగం మానేసింది. 
 
అయితే, తనకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాలని అడగ్గా.. 15 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. గడువు ముగిసిన తర్వాత జీతం కోసం వెళ్లగా మరో రెండు రోజులు సమయం కావాలని అంకిత్ అడిగాడు. ఆ తర్వాత జూలై 26న ఇస్తానన్నాడు. ఈ క్రమంలో కాజల్‌కు ఫోన్ చేసిన అగర్వాల్ జీతం తీసుకునేందుకు భందూప్‌లోని డ్రీమ్స్ మాల్ వద్దకు రావాల్సిందిగా కోరాడు. 
 
అక్కడికి వెళ్లి అతడికి ఫోన్ చేయగా మాల్‌ పై ఫ్లోర్‌కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన కాజల్‌ ముఖంపై కత్తితో దాడిచేశాడు. మెడను కోశాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని వెంటనే ముంబైలోని ఎంటీ అగర్వాల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments