Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు మారరు.. మదుమేహంతో చస్తున్నా రేప్‌ల యావే..

సహజీవనం చేస్తూనే గొడవల పరిష్కారానికి మత్తుపదార్థాల డ్రింక్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారం చేసి, వీడియో తీసి బెదిరించిన ఈ బెంగళూరు ప్రబుద్దుడు షరామామూలుగానే పోలీసులుకు చిక్కాడు. ఈ దేశంలో ఆడదాన్ని ఇంత సులభంగా మోసగించవచ్చా అనడానికి ఈ ఇంటీరియర్ డి

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (02:00 IST)
సహజీవనం చేస్తూనే గొడవల పరిష్కారానికి మత్తుపదార్థాల డ్రింక్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారం చేసి, వీడియో తీసి బెదిరించిన ఈ బెంగళూరు ప్రబుద్దుడు షరామామూలుగానే పోలీసులుకు చిక్కాడు. ఈ దేశంలో ఆడదాన్ని ఇంత సులభంగా మోసగించవచ్చా అనడానికి ఈ ఇంటీరియర్ డిజైనర్ తాజా ఉదాహరణ. విషయాల్లోకి వెళితే..
 
బెంగళూరులోని బార్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాన్ని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే....నగరంలోని రెసిడెన్సీ రోడ్‌లోనున్న ఓ బార్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతి(21)కి రామ్మూర్తి నగర్‌కు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ చక్రధర్‌రెడ్డితో పరిచయమైంది. పరిచయం ప్రేమతో మారడంతో ఇద్దరూ రామ్మూర్తినగర్‌లో సహజీవనం సాగించారు.
 
అయితే కొద్ది కాలంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గత ఫిబ్రవరిలో చక్రధర్‌రెడ్డి గొడవలు పరిష్కరించుకుందామంటూ యువతిని తన గదికి పిలుపించుకున్నాడు. యువతి గదికి రాగానే మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్స్‌ ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. 
 
దీంతో యువతి రెండు రోజుల క్రితం రామ్మూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చక్రధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుమేహంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స పూర్తి కాగానే అరెస్ట్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments