Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ వీడియో చూసి క్యారెట్ బీర్ తయారీ.. అరెస్టు

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (16:58 IST)
మనకు తెలియని ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే మన ముందున్న ఏకైక మార్గం యూట్యూబ్. ఇందులో దేన్ని ఎలా తయారు చేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ కోవలోనే యూట్యూబ్ వీడియో చూసి ఓ యువకుడు క్యారెట్ బీర్‌ తయారు చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి సమీపంలోని నాచ్చికుప్పం అనే ప్రాంతానికి చెందిన సుకుమార్ (25) అనే యువకుడు లాక్‌డౌన్ కాలాన్ని క్యాష్‌గా మార్చుకోవాలని ప్రయత్నించాడు. ఎందుకంటే... అనేక మంది మద్యం లేక విలవిల్లాడిపోతున్నారు. 
 
దీంతో యూట్యూబ్ చూసి క్యారెట్ బీర్ తయారు చేశాడు. క్యారెట్ జ్యూస్‍‌కు ఈస్ట్ అనే రసాయన పౌడర్‌ను చేర్చి రెండు రోజులు మగ్గబెట్టి ఆ తర్వాత తాగితే మత్తు వస్తుందని ఓ యూట్యూబ్ వీడియో చూసి తెలుసుకున్నారు. ఆ ప్రకారంగానే క్యారెట్ బీరు తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటాపడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించి తయారు చేసినపెట్టిన క్యారెట్ బీరును స్వాధీనం చేసుకుని, సుకుమార్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments