Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహానికి ముందే కౌన్సెలింగ్ : కేరళ మహిళా కమిషన్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (12:54 IST)
కేరళ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. 
 
అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస, వరకట్న వేధింపల కేసులు భారీగా నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఉత్రా కేసు(పాముతో భార్యను చంపించిన సంఘటన), విస్మయ (వరకట్న వేధింపలతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్‌ స్టూడెంట్‌) కేసులు దేశంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌ ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేరళ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ సతీదేవి తెలిపారు. దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను ఈ కౌన్సెలింగ్‌లో వధూవరులకు వివరించనున్నట్లు ఆమె పేర్కొంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments