Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

సెల్వి
శుక్రవారం, 23 మే 2025 (14:59 IST)
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థినిపై ఆమె ఇద్దరు క్లాస్‌మేట్స్, వారి స్నేహితులలో ఒకరు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పూణే, సోలాపూర్, సాంగ్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారిని మే 27 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు ఒక అధికారి తెలిపారు. 
 
22 ఏళ్ల వైద్య విద్యార్థిని మే 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో థియేటర్‌లో సినిమా చూద్దామని తీసుకెళ్లారు. దానికి ముందు, నిందితుడు ఆమెను కొద్దిసేపు ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చారని, మద్యం సేవించిన తర్వాత ఆమెకు తల తిరిగిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న ఈ ముగ్గురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని, దాని గురించి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని అధికారి తెలిపారు. 
 
కర్ణాటకలోని బెలగావికి చెందిన బాధితురాలు తరువాత ఈ సంఘటనను తన తల్లిదండ్రులకు వివరించగా, వారు విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. నిందితులపై సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం