Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్యను రేప్ చేయమని బావకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన భర్త.. ఎక్కడ?

ఈ కాలంలో వావివరసలు మంటగలిసిపోతున్నాయి. బంధాలు అనుబంధాలకు విలువేలేకుండా పోతోంది. ఫలితంగా మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. ఇంకొందరు కామంతో కళ్లుమూసుకుని పోయి కామాంధులుగా తయారవుతున్నారు.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:37 IST)
ఈ కాలంలో వావివరసలు మంటగలిసిపోతున్నాయి. బంధాలు అనుబంధాలకు విలువేలేకుండా పోతోంది. ఫలితంగా మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. ఇంకొందరు కామంతో కళ్లుమూసుకుని పోయి కామాంధులుగా తయారవుతున్నారు. తాజాగా ఓ భర్త.. తన భర్యను రేప్ చేయమని బావకు ఆఫర్ ఇచ్చాడు. సభ్యసమాజం తలదించుకునే సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
పల్ఘర్ జిల్లాలోని బొయ్సర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 22 ఏళ్ల యువతితో ఈనెల 7వ తేదీన వివాహమైంది. భార్యతో కలిసి ఉంటున్న అతనికి ఇంటికి అక్కాబావ వచ్చారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై అతని బావ అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించి అతనిని హెచ్చరించింది. తీరా భర్త ఇంటికొచ్చాక జరిగిన విషయాన్ని చెప్పింది. 
 
బావకు బుద్ధి చెప్పాల్సిన ఆమె భర్త అత్యంత నీచానికి దిగజారాడు. బావను పిలిచి తన భార్యతో గడపమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో అవకాశం కోసం ఎదురుచూసిన ఆ మృగాడు ఆమె జీవితాన్ని చిదిమేశాడు. బాధను దిగమింగుకున్న ఆ వివాహిత మౌల్వి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిందంతా పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments