Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆహ్వానం... 11లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి...

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (09:55 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తాజాగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించారు. 
 
తమ ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఫడ్నవీస్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. కాగా, గత నెల 21వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి అతిపెద్ద కూటమిగా అవతరించిన విషయం తెల్సిందే. అయితే, ఈ రెండు పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు సయోధ్య కుదరలేదు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, బీజేపీ-శివసేన కూటమికి 163 సీట్లు లభించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలు సంపాదించింది. ఇతరులకు 22 స్థానాలు లభించాయి. అయితే సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా, బీజేపీ అంగీకరించలేదు. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో విపరీతమైన జాప్యం ఏర్పడింది.
 
కాగా , సోమవారం బలనిరూపణ చేయాల్సిందిగా ఫడ్నవీస్ కు గవర్నర్ సూచించారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా బీజేపీకి ఈ అవకాశం కల్పించారు. ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 145 స్థానాల మార్కుకు సుదూరంగా నిలిచిపోయింది. శివసేన మద్దతిస్తేనే బీజేపీ సర్కారు గట్టెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments