Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధురాలు.. బ్రేకులేసినా.. రెండు బోగీలు దాటుకెళ్లాయి.. ఆపై?!

Webdunia
గురువారం, 26 మే 2016 (15:57 IST)
రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌‌ నుంచి నడుచుకుంటూ వెళ్ళి రైలు పట్టాలపై పడిన ఓ వృద్ధురాలు.. ఆమెపై రెండు బోగీలు దాటుకుంటూ వెళ్లినా.. స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఘట్కోపర్‌ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫామ్ నుంచి జారి పట్టాల మధ్యలో పడిపోయిన ఆ వృద్ధురాలిని చూసి లోకల్ ట్రైన్ మోటర్‌మెన్‌ బ్రేక్ కూడా వేశాడు. అయినప్పటికీ రెండు బోగీలు ఆమెను దాటుకుంటూ వెళ్లాయి. అయితే అదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. అమృత్‌నగర్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ప్రమీలా బాబన్‌ పోఖర్కర్ ఫ్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళ్తుండగా పట్టాలపై పడిపోయింది.  పట్టాలపై ప్రమీలను చూడగానే.. రైల్లో అప్రమత్తంగా ఉన్న మోటర్‌మెన్‌ బ్రేక్‌లు వేశాడు. అయితే రెండు బోగీలు ఆమె మీదినుంచి వెళ్లిన తర్వాతే రైలు ఆగింది. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలికి చిన్న గాయం తప్ప పెద్దగా గాయాలు లేకపోవడంతో స్థానికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే సీసీటీవీ ఫుటేజ్‌ల్లో మాత్రం ప్రమీల.. తనంత తానుగా దిగి.. పట్టాలపై పడుకున్నట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ.. ప్రమీల మాత్రం తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించలేదంటోంది. ప్రమీలా కుమార్తె తల్లికి మనస్థిమితం లేదని చెప్తోంది.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments