మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (17:24 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవర్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే, శివసేన నేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం సీఎం పదవికి కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఓ మెట్టు దిగారు. కొత్త సీఎం అభ్యర్థి ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటానని స్పష్టం చేశారు. 
 
కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారుప. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అన్నారు.
 
'మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశా.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయా. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగా.. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను.. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. సీఎంగా ఎటువంటి అసంతృప్తి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షాలు అండగా నిలిచారు. తాజా పరిణామాలపై వారితో ఫోన్‌లో మాట్లాడా. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాను' అని ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi : హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రిచర్డ్ రిషి చిత్రం ద్రౌపది 2

OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments