గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (17:36 IST)
కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెందిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తీవ్రకలకలం సృష్టించింది. ఓ అగంతకుడు ఆదివారం ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఇంటి పరిసరాలను గాలించాయి.
 
అలాగే, సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు తనిఖీ బృందాలు గడ్కరీ నివాసానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యంకాలేదు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ అకతాయి చేసిన నకిలీ కాల్‌గా గుర్తించారు. 
 
మరోవైపు, ఈ బాంబు బెదిరింపును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుని, ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు కొద్ది వ్యవధిలోనే నిందితుడు ఆచూకీని కనుగొన్నాయి. నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న మద్యం దుకాణంలో పని చేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌గా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఈ బెదిరింపి కాల్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments