Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుగురు వ్యక్తులను బలిగొన్న శానిటైజర్

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (09:07 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ మిగుల్చుతున్న విషాదం అంతా ఇంతాకాదు. ఈ వైరస్ సోకి వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో తీవ్ర విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. శానిటైజర్‌ తాగిన ఏడుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ తహసీల్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. 
 
ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో శానిటైజర్‌‌ను మద్యంగా భావించి తాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డారు.
 
వని పోలీసు స్టేషన్ పరిధిలోని యావత్మల్‌ తహసీల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరంతా ప్రాణాల మీదకు తెచ్చకున్నారు. 30 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ 250 మిల్లీలీటర్ల మద్యం ఇచ్చే కిక్కు ఇస్తుందని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని న్యాయవాది దిలీప్‌ పార్చేక్‌ ఆరోపించారు. 
 
దీంతో వీరంతా ఐదు లీటర్ల శానిటైజర్‌ కొనుగోలు చేసుకొని శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారని, ఆ తర్వాత వాంతులు మొదలయ్యాయన్నారు. వారందరినీ వనిలోని ప్రభుత్వ గ్రామీణ హాస్పిటల్‌లో చేర్పించగా.. పరిస్థితి విషమించి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు.
 
కాగా, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే నలుగురి మృతదేహాలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహింయచారరు. మృతుల్లో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువలకు అప్పగించామని వని పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ వైభవ్‌ జాదవ్‌ తెలిపారు. మృతుల్లో ఐదుగురు 35 ఏళ్లలోపు వారుండగా.. ఇద్దరు 47 ఏళ్లలోపు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments