Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది: పవన్ తాత ఇరానీకి బెదిరింపులు!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:53 IST)
'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇరానీ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించారు. ఈ నేపథ్యంలో ఇరానీకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 
 
ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి ఇరానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందుకే, ఆయనకు భద్రత కల్పిస్తున్నామని ముంబయి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులకు మాఫియా బెదిరింపులు వస్తున్నాయి. నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట కొందరు కాల్పులు కూడా జరిపారు. షారూఖ్ ఖా‌న్‌కు  సైతం బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఇరానీకి అదే తరహాలో ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments