Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పబ్లిక్ ఇంట్రెస్ట్‌'లా లేదు 'పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌'లా ఉంది... 2 నిమిషాల్లో జయ హెల్త్ పిటీషన్ కొట్టేసిన మద్రాసు హైకోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థిని బహిర్గతం చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను కొట్టివేసింది. ఈ పిటీషన్‌ పబ్లిక్ ఇంట్రెస్ట్‌లా లేదనీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌లా ఉ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (12:43 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థిని బహిర్గతం చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను కొట్టివేసింది. ఈ పిటీషన్‌ పబ్లిక్ ఇంట్రెస్ట్‌లా లేదనీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌లా ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్.కే.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
కాగా, గత నెల 22వ తేదీన జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆమె ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం చేయాలంటూ సామాజికవేత్త ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పిటీషన్‌దారునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇది పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌లా పిటిషన్‌లా లేదు...పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ పిటిషన్‌లా ఉందని కోర్టు అభిప్రాయపడింది. జయలలిత ఆరోగ్యాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని హితవు పలికింది.చికిత్స ఎన్నిరోజులన్నది ఎవరూ చెప్పలేరని పేర్కొంటూ.. ఈ పిటీషన్‌పై వాదనలను కేవలం 2 నిమిషాలే వాడుకుని కొట్టివేసింది.
 
మరోవైపు సీఎం జయలలితకు చికిత్స అందించేందుకు ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యుల బృందం చెన్నై వచ్చింది. అలాగే, లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే మరోమారు గురువారం చెన్నైకు రానున్నారు. కాగా, ఎయిమ్స్ వైద్య బృందం అపోలో ఆస్పత్రిలో ఆమెకు చికిత్స ప్రారంభించింది. ఊపిరితిత్తులు, గుండె మత్తుమందు నిపుణులు జయలలితకు చికిత్స అందిస్తున్నారు. జయలలితకు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాకే ఏదైనా విషయం చెప్పగలమని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments