Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుడికి బుద్ధి చెప్పిన శివంగి... రేప్ చేయబోతే మర్మాంగాన్ని కోసేసింది..

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (09:39 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి కామాంధుడిపై శివంగిలా దాడి చేసింది. తనను రేప్ చేసేందుకు వచ్చిన కామాంధుడికి మగతనం లేకుండా చేసింది. మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని సిధీ జిల్లా ఉమరియా గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమరియా గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నది. దీన్ని గమనించిన ఓ కామాంధుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే, ఆ మహిళ ఆ కామాంధుడిపై శివంగిలా దాడిచేసి, మర్మాంగాన్ని కోసివేసింది. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటలకు ఈ ఉదంతం జరిగిందని ఖాదీ ప్రాంత ఎస్సై ధర్మేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ తెలిపారు.
 
ఆ సమయంలో తన భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లినట్లు మహిళ(45) చెప్పిందని వెల్లడించారు. 13 ఏళ్ల కొడుకు కూడా మహిళతో పాటు ఉన్నాడని చెప్పారు. నిందితుడు(45) ఇంట్లోకి చొరబడగానే.. దొంగలు వచ్చారని భయపడి కొడుకు బయటకు పరుగులు తీశాడని వివరించారు. 
 
'మహిళను కొట్టి లైంగికంగా దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడు. 20 నిమిషాలకు పైగా నిందితుడిని మహిళ నిలువరించింది. తనను తాను కాపాడుకునేందుకు మంచం కింద ఉన్న కొడవలి తీసి.. నిందితుడి మర్మాంగాన్ని కోసేసింది. తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది' అని ఎస్సై ధర్మేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం